Raghu Rama Krishna Raju: సీఎంకు కడప ఉక్కు ఫ్యాక్టరీపై ఉన్న శ్రద్ధ విశాఖ ఉక్కుపై లేదు: రఘురామకృష్ణరాజు

Raghurama Krishnaraju comments on CM Jagan over Vizag Steel Plant
  • పవన్ సభతో విశాఖ కదిలిపోయిందని వ్యాఖ్య 
  • విశాఖ ఉక్కు కోసం సీఎం ఏంచేశారన్న రఘురామ
  • ఒక్కసారి కూడా ఆందోళన చేయలేదంటూ విమర్శ   
  • మహాపాదయాత్ర రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచన 
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తాజా పరిణామాలు, రాష్ట్ర రాజకీయాలపై స్పందించారు. నిన్న పవన్ కల్యాణ్ సభతో విశాఖ కదిలిపోయిందని అన్నారు. విశాఖ ఉక్కును కాపాడాల్సిన బాధ్యత నూటికి నూరు శాతం వైసీపీదేనని స్పష్టం చేశారు. సీఎం ఒక్కనాడు అయినా విశాఖ ఉక్కు కోసం ఆందోళన చేశారా? అని ప్రశ్నించారు.

సొంత జిల్లా కడపలో ఉక్కు ఫ్యాక్టరీపై ఉన్న శ్రద్ధ విశాఖ ఉక్కుపై లేదంటూ సీఎం జగన్ పై విమర్శలు చేశారు. తన అనర్హతపై పార్లమెంటులో ప్లకార్డులు పట్టుకున్న ఎంపీలు, విశాఖ ఉక్కు గురించి కూడా ప్లకార్డులు పట్టుకోవాలని రఘురామ హితవు పలికారు.

అటు, రైతుల మహాపాదయాత్రపైనా రఘురామ స్పందించారు. రైతుల పాదయాత్రకు ఇబ్బందులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక, రాష్ట్ర రుణ ఒప్పంద పత్రంలో గవర్నర్ పేరు కూడా రాయడం దుర్మార్గమని రఘురామ అభిప్రాయపడ్డారు. ఏపీ శాసనమండలి రద్దు చేయాలని నాడు అసెంబ్లీలో తీర్మానం చేసి, నేడు అదే మండలిలో ఖాళీలు భర్తీ చేయాలంటూ ఢిల్లీలో కాళ్లావేళ్లా పడి బతిమాలుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
Raghu Rama Krishna Raju
CM Jagan
Vizag Steel Plant
Kadapa Steel
YSRCP
Andhra Pradesh

More Telugu News