Hyderabad: హైదరాబాదులో ఇద్దరు యాచకుల దారుణ హత్య

Two beggers murdered in Hyderabad
  • హబీబ్ నగర్ పీఎస్ పరిధిలో ఒక హత్య
  • నాంపల్లి పీఎస్ పరిధిలో రెండో హత్య
  • తలపై రాయితో మోదీ హత్యలు చేసిన నిందితులు

హైదరాబాదులోని నాంపల్లిలో యాచకుల హత్యలు కలకలం రేపుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు వీరిని దారుణంగా హతమార్చారు. తొలి హత్య హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఒక యాచకుడిని తలపై రాయితో మోది చంపేశారు. రెండో హత్య నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న యాచకుడి తలను రాయితో కొట్టి చంపేశారు. రెండు హత్యల్లో కూడా తలపై రాయితో మోది చంపడంతో... ఈ రెండు హత్యలు ఒకరే చేసుంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News