Akhilesh Yadav: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను: అఖిలేశ్ యాదవ్ సంచలన ప్రకటన

Akhilesh Yadav announces that he will not contest in coming assembly elections
  • యూపీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు
  • ఆర్ఎల్డీతో పొత్తు ఖరారయిందన్న అఖిలేశ్
  • తన బాబాయ్ తో ఇబ్బంది లేదని వ్యాఖ్య
దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ భారత రాజకీయాలను శాసిస్తుంటుంది. రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీకి ఢిల్లీలో ఎంతో పవర్ ఉంటుంది. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీకి ఎన్నికల జరగబోతున్నాయి. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని అన్నారు.

రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) పార్టీతో సమాజ్ వాదీ పార్టీకి పొత్తు ఉంటుందని చెప్పారు. పొత్తు ఖరారయిందని, సీట్ల పంపకాలపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. తన బాబాయ్ శివపాల్ యాదవ్ కు చెందిన ప్రగతిశీల్ సమాజ్ వాదీ పార్టీ లోహియా (పీఎస్పీఎల్)తో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని... వారితో కలిసి పని చేయడంలో అభ్యంతరం లేదని చెప్పారు. అఖిలేశ్ యాదవ్ ప్రస్తుతం ఆజంఘర్ నుంచి ఎంపీగా ఉన్నారు.
Akhilesh Yadav
Samajwadi Party
Uttar Pradesh
Assembly Elections

More Telugu News