JD Lakshminarayana: రుషికొండకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

  • జీవో నంబర్ 3454 ప్రకారం కొండలు, నదులను తొలగించకూడదు
  • తొలగించాలనుకుంటే ప్రజల అనుమతి తప్పనిసరి
  • హుదూద్ తుపాను గాలులను రుషికొండ అడ్డుకుంది
It may bea danger to Rushikonda says CBI Ex JD Lakshminarayana

విశాఖపట్నంలోని రుషికొండపై ఉన్న హరిత రిసార్ట్స్ ను ప్రభుత్వం కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీంతోపాటు మరికొంత కొండ భాగాన్ని చదును చేసింది. ఆ ప్రాంతంలో ఏం కడుతున్నారో కూడా అధికారులు వెల్లడించడం లేదు. దీంతో ఇప్పటికే టీడీపీ ఈ అంశంపై ఆందోళనలను చేపట్టింది.

తాజాగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రుషికొండ హరిత రిసార్ట్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందడంలో టూరిజం కూడా ముఖ్యపాత్రను పోషిస్తుందని అన్నారు. రుషికొండ ప్రాంతానికి పక్క రాష్ట్రాల నుంచే కాకుండా... విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారని చెప్పారు.

రానున్న రోజుల్లో జరిగే అభివృద్ధి దృష్ట్యా నదులు, కొండలను తొలగించకూడదని జీవో నంబర్ 3454 స్పష్టంగా చెపుతోందని లక్ష్మీనారాయణ తెలిపారు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో తొలగించాలనుకుంటే ప్రజల అనుమతి తీసుకోవాలని చెప్పారు. ఇలాంటి కొండలను తొలగించాలనుకుంటే... రాబోయే రోజుల్లో వచ్చే ప్రమాదాలను కూడా అంచనా వేయాలని అన్నారు. హుదూద్ తుపాను సమయంలో వచ్చిన బలమైన గాలులను ఈ కొండలు అడ్డుకున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ప్రస్తుత చర్యలు రుషికొండకే ముప్పు కలిగించే అవకాశం ఉందని అన్నారు.

More Telugu News