Nani: నాని మూవీలో నిత్యామీనన్!

Dasara movie upadate
  • గతంలో వచ్చిన 'అలా మొదలైంది' హిట్టు 
  • మళ్లీ ఇంతకాలానికి నానితో సినిమా
  • టైటిల్ గా 'దసరా' ఖరారు
  • అతిథి పాత్రలో నిత్యామీనన్

నిత్యామీనన్ .. తెలుగు .. తమిళ .. మలయాళ.. కన్నడ సినిమాల్లో మంచి క్రేజ్ ఉన్న పేరు. అందం .. అభినయం నిత్యామీనన్ సొంతం. ఈ నాలుగు భాషల్లో ఎక్కడా కూడా ఆమె స్కిన్ షో చేయకుండా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోవడం ఆమె ప్రత్యేకతగా కనిపిస్తుంది. సహజ నటిగా సాయిపల్లవికి ముందు వినిపించిన పేరు నిత్యామీనన్.

అలాంటి ఆమెకి ఇటీవల కాలంలో అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. అయినా చింత లేదన్నట్టుగా ఆమె తనకి నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తూ వెళుతోంది. అలా తాజాగా ఆమె మరో సినిమాను అంగీకరించినట్టు  తెలుస్తోంది. ఆ సినిమా పేరే 'దసరా'. నాని కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు.

సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ ను తీసుకున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'నేను లోకల్' విజయాన్ని సాధించింది. మళ్లీ  ఇప్పుడు ఈ కాంబినేషన్ సెట్  అయింది. ఈ సినిమాలో ముఖ్యమైన గెస్టు రోల్ కోసం నిత్యామీనన్ ను తీసుకున్నారు. ఆమె కెరియర్ నాని సినిమా 'అలా మొదలైంది'తో మొదలైందనే సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News