Urmila Matondkar: సినీ నటి ఊర్మిళకు కరోనా పాజిటివ్

Actress Urmila Matondkar tests Corona positive
  • తనకు కరోనా పాజిటివ్ అని ప్రకటించిన ఊర్మిళ
  • హోం క్వారంటైన్ లో ఉన్నానని వెల్లడి
  • తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన అందరూ టెస్ట్ చేయించుకోవాలని సూచన

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మూడో వేవ్ వచ్చే అవకాశం కూడా ఉందని కొందరు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సినీ పరిశ్రమలో కూడా కరోనా మహమ్మారి మళ్లీ టెన్షన్ పెంచుతోంది. యువనటి ప్రగ్యా జైశ్వాల్ ఇటీవలే రెండోసారి కరోనా బారిన పడటం కలకలం రేపింది. తాజాగా రామ్ గోపాల్ వర్మ 'రంగీలా' భామ, రాజకీయ నాయకురాలు ఊర్మిళ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు.

తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని ఊర్మిళ తెలిపింది. ప్రస్తుతం బాగానే ఉన్నానని... హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నానని చెప్పారు. గత 15 రోజులుగా తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీపావళి సంబరాలను అన్ని జాగ్రత్తలను పాటిస్తూ జరుపుకోవాలని కోరారు. 2016లో ఊర్మిళ తన ప్రియుడు మెహసిన్ అఖ్తర్ ను పెళ్లాడారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసి ఆమె ఓడిపోయారు. ఎన్నికల తర్వాత ఆమె శివసేన పార్టీలో చేరారు.

  • Loading...

More Telugu News