Madhya Pradesh: తాగి ఊగుతూ పాఠశాలకు.. బాలికతో డ్యాన్స్ చేయించిన హెడ్‌మాస్టర్

Drunk headmaster forces girl students to dance with him
  • మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లాలో ఘటన
  • తాను డ్యాన్స్ చేస్తూ విద్యార్థినులతోనూ డ్యాన్సులు
  • సస్పెండ్ చేసిన కలెక్టర్
పూటుగా మందు తాగిన ఓ ప్రధానోపాధ్యాయుడు అలాగే స్కూలుకొచ్చాడు. మద్యం మత్తులో తను డ్యాన్స్ చేస్తూ బాలికలతో డ్యాన్స్ చేయించాడు. అంతేనా.. ఆ డ్యాన్సులను వీడియో కూడా తీశాడు. మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది.

జిల్లాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధియదో గ్రామంలో మిడిల్ స్కూల్ ఉంది. శుక్రవారం తప్పతాగి స్కూలుకొచ్చిన హెడ్మాస్టర్ రాజేశ్ ముండా తాను డ్యాన్స్ చేస్తూ విద్యార్థినులతో డ్యాన్స్ చేయించాడు. ఆ డ్యాన్సులు చిత్రీకరించాడు.

ఈ వీడియోలు వైరల్ కావడం, విషయాన్ని బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు డీఈవో ఎస్‌కే మిశ్రాకు ఫిర్యాదు చేశారు. విచారణకు ఆదేశించిన కలెక్టర్ కృష్ణ చైతన్య నివేదిక అందిన వెంటనే నిన్న రాజేశ్ ముండాను సస్పెండ్ చేశారు.
Madhya Pradesh
Damoh
Govt School
Head Master

More Telugu News