Assembly Canteen: అసెంబ్లీ క్యాంటీన్ మూసివేత... మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరి భోజనం వాళ్లు తెచ్చుకోవాలన్న సీఎం స్టాలిన్

Tamilnadu CM Stalin orders for Tamilandu assembly closure
  • సీఎంగా తనదైన శైలిలో స్టాలిన్ పాలన
  • కీలక నిర్ణయాలతో ముందుకు పోతున్న డీఎంకే అధినేత
  • నిరాడంబరతకు మారుపేరుగా స్టాలిన్
  • ప్రజాప్రతినిధులు ఇంటి నుంచే భోజనం తెచ్చుకోవాలని ఆదేశం
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఎంత నిరాడంబరంగా ఉంటారో అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనదైనశైలిలో పాలన కొనసాగిస్తున్నారు. తాజాగా, మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ క్యాంటీన్ మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇకపై అసెంబ్లీకి వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరి భోజన ఏర్పాట్లు వారే చూసుకోవాలని స్పష్టం చేశారు. క్యాంటీన్ మూసివేస్తున్నందున ప్రజాప్రతినిధులు వారి ఇళ్ల నుంచే భోజనాలు తెచ్చుకోవాలని నిర్దేశించారు.
Assembly Canteen
Tamilnadu
CM Stalin
DMK

More Telugu News