Afghanistan: టీ20 వరల్డ్ కప్: నమీబియాపై 5 వికెట్లకు 160 రన్స్ చేసిన ఆఫ్ఘనిస్థాన్

  • గ్రూప్-2లో ఆఫ్ఘనిస్థాన్ వర్సెస్ నమీబియా
  • అబుదాబిలో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్
  • రాణించిన షాజాద్, కెప్టెన్ నబీ
Afghanistan bats well against Namibia

టీ20 వరల్డ్ కప్ లో నేడు గ్రూప్-2లో నమీబియా, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. ఓపెనర్ మహ్మద్ షాజాద్ అత్యధికంగా 45 పరుగులు చేశాడు. 33 బంతులాడిన ఈ భారీకాయుడు 3 ఫోర్లు, 2 సిక్సర్లతో అలరించాడు. మరో ఓపెనర్ హజ్రఫుల్లా జాజాయ్ 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 33 పరుగులు నమోదు చేశాడు.

కెప్టెన్ మహ్మద్ నబీ చివర్లో ధాటిగా ఆడడంతో ఆఫ్ఘనిస్థాన్ స్కోరు 150 మార్కు దాటింది. నబీ కేవలం 17 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సుతో 32 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మాజీ సారథి అస్ఘర్ ఆఫ్ఘన్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సుతో 31 పరుగులు చేశాడు. నమీబియా బౌలర్లలో రూబెన్ ట్రంపుల్ మాన్ 2, లోఫ్టీ ఈటన్ 2, స్మిట్ 1 వికెట్ తీశారు.

More Telugu News