Gorantla Butchaiah Chowdary: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై విపక్ష నేతగా వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల వీడియో పంచుకున్న బుచ్చయ్య చౌదరి

Gorantla Butchaiah shares YS Jagan comments on fuel prices hike in past
  • ఏపీలో చమురు ధరల పెంపు
  • ట్విట్టర్ లో ప్రశ్నించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి
  • ధరలు తగ్గించే బాధ్యత సీఎందేనని వెల్లడి
  • పెరిగిన రేట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
గతంలో విపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై అసెంబ్లీలో తీవ్ర ఆవేశంతో ప్రసంగించారు. ఆ వ్యాఖ్యల తాలూకు వీడియోను టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్ లో పంచుకున్నారు. "అరెరే... ఆ రోజు అంత 'బీపీ'తో ఆవేశంగా మాట్లాడారు. మరి ఇప్పుడు ఆ ఆవేశం ఏది సీఎం జగన్?" అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.

"రాష్ట్రంలో చమురు ధరలు ఆకాశాన్ని అంటాయి... మరి ఆ ధరలు తగ్గించే బాధ్యత మీ మీద లేదా మడమ తిప్పని నేత గారూ?" అంటూ నిలదీశారు. "మీ 'బీపీ'లు పెరిగిన రేట్ల మీద చూపించండి ముఖ్యమంత్రి గారూ!" అంటూ వ్యాఖ్యానించారు.
Gorantla Butchaiah Chowdary
YS Jagan
Fuel Prices
Video
Andhra Pradesh

More Telugu News