Nagashourya: హీరోగా అన్నిరకాల పాత్రల్లో చేయాలనుంది: నాగశౌర్య

Varudu Kaavalenu movie update
  • 'వరుడు కావలెను'కి హిట్ టాక్ 
  • సక్సెస్ మీట్ నిర్వహించిన టీమ్
  • తన నమ్మకం నిజమైందన్న శౌర్య
  • లవర్ బోయ్ ఇమేజ్ కి కట్టుబడనని స్పష్టీకరణ
నాగశౌర్య - రీతూ వర్మ జంటగా 'వరుడు కావలెను' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలైన తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా, సక్సెస్ మీట్ ను జరుపుకుంది. ఈ సక్సెస్ మీట్లో నాగశౌర్య మాట్లాడాడు.

'వరుడు కావలెను' కథ వినగానే ఈ సినిమా హిట్ అవుతుందని నేను బలంగా నమ్మాను. అదే మాట లక్ష్మీ సౌజన్యతో పాటు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను చెప్పాను. నేను అనుకున్నట్టుగానే యూత్ నుంచి .. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

ఈ సినిమాతో ఫ్యామీలీ ఆడియన్స్ కి మరింతగా చేరువైనందుకు సంతోషంగా ఉంది. లవర్ బాయ్ ఇమేజ్ కి కట్టుబడి పోవాలని నేను కోరుకోవడం లేదు. ఒక హీరోగా అన్నిరకాల పాత్రలను చేయాలనుంది. విభిన్నమైన పాత్రలు చేస్తూ, నాపై ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను" అని చెప్పుకొచ్చాడు.
Nagashourya
Ritu Varma
Varudu Kavalenu

More Telugu News