Dhrithi Rajkumar: బెంగళూరు చేరుకున్న పునీత్ కుమార్తె ధృతి... తండ్రి తలను నిమురుతూ రోదించిన వైనం

Puneeth daughter gets highly emotional after seen her father dead body
  • పునీత్ రాజ్ కుమార్ కన్నుమూత
  • అమెరికా నుంచి స్వదేశానికి వచ్చిన కుమార్తె
  • తండ్రి భౌతికకాయాన్ని చూసి భావోద్వేగాలకు లోనైన ధృతి
  • ఫ్రీజర్ బాక్స్ తెరిచిన బంధువులు
నిన్న గుండెపోటుతో మరణించిన కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ భౌతికకాయాన్ని చూసి ఆయన పెద్ద కుమార్తె ధృతి తల్లడిల్లిపోయింది. ఈ మధ్యాహ్నం అమెరికా నుంచి ఢిల్లీ వచ్చిన ధృతి, సాయంత్రానికి స్వస్థలం బెంగళూరు చేరుకుంది.

కంఠీరవ స్టేడియానికి వచ్చిన ధృతి... విగతజీవుడిలా కనిపించిన తండ్రిని చూసి తీవ్ర భావోద్వేగాలకు గురైంది. తండ్రి పార్థివదేహంపై పడి భోరుమని రోదించింది. ధృతి రాకతో బంధువులు భౌతికకాయాన్ని ఉంచిన ఫ్రీజర్ బాక్స్ ను తెరవగా, తండ్రి తలను నిమురుతూ ఆమె విలపించిన తీరు అక్కడున్న వారిని కదిలించి వేసింది.
Dhrithi Rajkumar
Puneeth Rajkumar
Bengaluru
USA
Karnataka

More Telugu News