South Africa: దక్షిణాఫ్రికా టార్గెట్. 143 రన్స్... 26 పరుగులకే రెండు వికెట్లు డౌన్

South Africa lost openers in chasing
  • షార్జాలో శ్రీలంక వర్సెస్ దక్షిణాఫ్రికా
  • మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక
  • 20 ఓవర్లలో 142 ఆలౌట్
  • ఓపెనర్ నిస్సాంక అర్ధసెంచరీ
టీ20 వరల్డ్ కప్ లో శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు షార్జా వేదికగా పోటీపడుతున్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ పతుమ్ నిస్సాంక 58 బంతుల్లో 72 పరుగులు చేయడం విశేషం. అతడి స్కోరులో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అసలంక 21 పరుగులు సాధించాడు. వీరిద్దరు తప్ప లంక జట్టులో మరెవ్వరూ రాణించలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్పిన్నర్ తబ్రైజ్ షంసీ 2, ప్రిటోరియస్ 3, నోర్జే 2 వికెట్లు తీశారు.

అనంతరం ఏమంత కష్టసాధ్యం కాని లక్ష్యఛేదనకు దిగిన సఫారీలు 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయారు. రీజా హెండ్రిక్స్ 11, క్వింటన్ డికాక్ 12 పరుగులు చేసి అవుటయ్యారు. ఈ రెండు వికెట్లు చమీర ఖాతాలోకి వెళ్లాయి.
South Africa
Sri Lanka
Super-12
T20 World Cup

More Telugu News