Karthikeya: 'రాజా విక్రమార్క' నుంచి ట్రైలర్ రెడీ!

Raja Vikramarka trailer will release on 1st November
  • యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో 'రాజా విక్రమార్క'
  • కార్తికేయ జోడీగా తాన్య రవిచంద్రన్
  • సంగీత దర్శకుడిగా ప్రశాంత్ విహారి
  • నవంబర్ 12వ తేదీన సినిమా రిలీజ్  
'ఆర్ ఎక్స్ 100' సినిమాతో కార్తికేయ అటు యూత్ ఆడియన్స్ కి .. ఇటు మాస్ ఆడియన్స్ కి చేరువయ్యాడు. ఆ సినిమా తరువాత ఆయన ఆ స్థాయి హిట్ కొట్టలేకపోయాడు. కానీ విభిన్నమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతూనే ఉన్నాడు. అలా ఆయన చేసిన సినిమానే 'రాజా విక్రమార్క'.

ఈ సినిమాతో శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రశాంత్ విహారి ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ కి డేట్ ను సెట్ చేశారు. నవంబర్ 1వ తేదీన ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు.

ఇది యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రూపొందింది. కార్తికేయ సరసన నాయికగా తాన్య రవిచంద్రన్ కనిపించనుంది. నవంబర్ 12వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొడతాననే నమ్మకంతో కార్తికేయ ఉన్నాడు. మరి ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.
Karthikeya
Tanya Ravichandran
Sri Saripalli

More Telugu News