Roja: కుప్పం రండి తేల్చుకుందాం అంటూ సిగ్గులేకుండా సవాళ్లు విసురుతున్నారు: చంద్రబాబుపై రోజా ధ్వజం

Roja responds on Chandrababu Kuppam visit
  • కుప్పంలో చంద్రబాబు పర్యటన
  • విమర్శనాస్త్రాలు సంధించిన రోజా
  • కుప్పంలో కనీసం బాబుకు ఇల్లు, ఆఫీసు లేవని విమర్శలు
  • ఓట్లు ఎలా అడగ్గలుగుతున్నారని వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. బాబు ఓ వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కుప్పంలో కనీసం ఇల్లు, ఆఫీసు కూడా ఏర్పాటు చేయని బాబు, నేడు ప్రజలను ఓట్లు అడుగుతుండడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించారు. ఏనాడైనా తన నియోజకవర్గంలో సంక్షేమాన్ని పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. పైగా, కుప్పం రండి తేల్చుకుందాం అంటూ  సిగ్గులేకుండా సవాళ్లు విసురుతున్నారని విమర్శించారు.

గతవారం పట్టాభితో బూతు డ్రామాలు ఆడించిన బాబు, ఇప్పుడు కుప్పం వచ్చి బాంబు డ్రామాలు ఆడుతున్నాడని ఎద్దేవా చేశారు. కానీ ప్రజలు బాబు డ్రామాలను నమ్మేందుకు సిద్ధంగా లేరని రోజా పేర్కొన్నారు. ఉన్న క్యాడర్ ను కాపాడుకునేందుకు చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
Roja
Chandrababu
Kuppam
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News