Sharmila: ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకోబోతున్నాను: ష‌ర్మిల

will meet cheededu village people sharmila
  • ప్రజాప్రస్థానం 11వ రోజు కొన‌సాగుతోంది
  • ఇబ్ర‌హీంప‌ట్నం నియోజకవర్గంలో చేస్తున్నాను
  • సాయంత్రం చీదేడు గ్రామంలో మాట-ముచ్చట
వైఎస్సార్‌టీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల పాద‌యాత్ర కొన‌సాగిస్తున్నారు. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ వివ‌రాలు తెలిపారు. 'ప్రజాప్రస్థానం 11వ రోజు కొన‌సాగుతోంది. ఇబ్ర‌హీంప‌ట్నం నియోజకవర్గంలోని  జాపాల్ గ్రామం నుంచి ఎల్లమ్మ తండా, రంగాపూర్, జలాల్ మియా పల్లి మీదుగా పాదయాత్ర సాగుతోంది. సాయంత్రం చీదేడు గ్రామంలో మాట-ముచ్చట నిర్వహించి, ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకోబోతున్నాను' అని ఆమె ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు.

ష‌ర్మిల పాద‌యాత్ర‌పై వైఎస్సార్‌టీపీ కూడా ఓ ప్ర‌క‌ట‌న చేసింది. '11వ రోజు ఇబ్ర‌హీంప‌ట్నం నియోజకవర్గంలోని జాపాల్ గ్రామంలో ప్రజాప్రస్థానం మహాపాదయాత్ర ఘనంగా ప్రారంభమైంది. షర్మిలక్క పాదయాత్రకు ప్రజలు భారీగా తరలివచ్చారు. జాపాల్ గ్రామం నుంచి ఎల్లమ్మ తండా, రంగాపూర్, జలాల్ మియాపల్లి మీదుగా పాదయాత్ర సాగుతోంది' అని పేర్కొంది.
Sharmila
YSRTP
Telangana

More Telugu News