Raviteja: 'మహా సముద్రం' కథను రిజక్ట్ చేసిన హీరోలు వీరే!

  • భారీ అంచనాల మధ్య వచ్చిన 'మహా సముద్రం'
  • విడుదలైన తొలిరోజునే ఫ్లాప్ టాక్
  • నిర్మాతకు భారీ నష్టాలు
  • శర్వానంద్ -  సిద్ధార్థ్ లకు కలిసిరాని కష్టం  
Mahasamudram movie update

శర్వానంద్ - సిద్ధార్థ్ కథానాయకులుగా దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన 'మహా సముద్రం' భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామబ్రమ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా, భారీ తారాగణంతో రూపొందింది. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ కొడుతుందని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అజయ్ భూపతి చాలా బలంగా చెప్పాడు.

ఈ సినిమా కథను తాను ఓ పది మంది హీరోలవరకూ వినిపించాననీ .. కానీ వాళ్లు చేయడానికి ముందుకు రాలేదని అన్నాడు. శర్వానంద్ - సిద్ధార్థ్ చేసిన ఈ సినిమాతో ఇండస్ట్రీ నుంచి మరో హిట్ వెళుతుందని అన్నాడు. కానీ చివరికి ఈ సినిమా విడుదలైన తొలిరోజునే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. నిర్మాతకు భారీ నష్టాలనే తెచ్చిపెట్టినట్టు తెలుస్తోంది.

అయితే ఈ కథను రిజక్ట్ చేసిన హీరోలు ఎవరనే ఆసక్తి చాలామందిలో ఉంది. ఆ జాబితాలో రవితేజ .. నాని .. రామ్ .. నితిన్ .. నాగచైతన్య కనిపిస్తున్నారు. హిట్ కోసం ఎంతగానో ఎదురుచూసిన శర్వానంద్ కి గానీ .. సిద్ధార్థ్ కి గాని ఈ సినిమా ఎంతమాత్రం కలిసి రాకపోవడం విచారించదగిన విషయమే.

More Telugu News