Perni Nani: ఏపీ మంత్రి పేర్ని నానితో దిల్ రాజు, బన్నీవాసు తదితరుల భేటీ

Dil Raju and Bunny Vasu met AP minister Perni Nani
  • ఆన్ లైన్ టికెట్ల విక్రయం చట్ట సవరణకు క్యాబినెట్ ఆమోదం
  • పేర్ని నానితో దిల్ రాజు, బన్నీ వాసు బృందం భేటీ
  • ప్రభుత్వం తమను సమాచారం కోరిందన్న దిల్ రాజు
  • ఇంతకుముందే సీఎంను కలిసిన నాగార్జున
ఆన్ లైన్ లో సినిమా టికెట్ల విక్రయానికి సంబంధించిన చట్ట సవరణ ప్రతిపాదనలకు ఏపీ క్యాబినెట్ ఆమోదం లభించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సమాచార ప్రసార శాఖ మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ సినీ నిర్మాతలు సమావేశమయ్యారు. దిల్ రాజు, బన్నీ వాసు, వంశీ, డిస్ట్రిబ్యూటర్ అలంకార్ ప్రసాద్ ఈ భేటీలో పాల్గొన్నారు. సినిమా టికెట్ల ఆన్ లైన్ విక్రయం విధి విధానాలపై ఈ భేటీ ప్రధాన అజెండా అని తెలుస్తోంది.

కాగా భేటీకి వచ్చిన సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, తమను ప్రభుత్వం కొంత సమాచారం కావాలని అడిగిందని, అందుకే మంత్రిని కలిసేందుకు వచ్చామని తెలిపారు. కాగా, అగ్రహీరో నాగార్జున, నిర్మాతలు నిరంజన్ రెడ్డి, ప్రీతమ్ రెడ్డి ఇంతకుముందే సీఎం జగన్ ను కలిసి సినీరంగ అంశాలపై చర్చించారు.
Perni Nani
Dil Raju
Bunny Vasu
Tollywood

More Telugu News