బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

BJP MLA Raghunandan Rao house arrested
  • వరి వేస్తే ఉరేనన్న సిద్ధిపేట జిల్లా కలెక్టర్
  • కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన బీజేపీ
  • బీజేపీ శ్రేణులను ముందస్తు అరెస్టులు చేస్తున్న పోలీసులు
దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... వరి వేస్తే ఉరేనని... వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఇటీవల సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వివాదాస్పద హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. రైతులపై ఆంక్షలు ఏమిటంటూ అధికార పార్టీపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.
 
ఈ పరిస్థితుల నేపథ్యంలో, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా... ఈరోజు కలెక్టరేట్ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. మధ్యాహ్నం 12 గంటలకు కలెక్టరేట్ ను ముట్టడించేందుకు జిల్లా బీజేపీ సిద్ధమయింది. ఈ క్రమంలో రఘునందన్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో నివాసం ఉంటున్న ఆయనను నిర్బంధించారు. మరోవైపు బీజేపీ శ్రేణులెవరూ కూడా కలెక్టరేట్ వద్దకు వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.
Go Back to Shorts
Raghunandan Rao
BJP
House Arrest
Siddipet District
Collector

More Telugu News