దీపావళికి 'ఖిలాడి' సెకండ్ సింగిల్ !

29-10-2021 Fri 11:27
  • రవితేజ తాజా చిత్రంగా 'ఖిలాడి'
  • విడుదలకి సన్నాహాలు 
  • షూటింగు దశలో 'రామారావు ఆన్ డ్యూటీ '
  • లైన్లో 'ధమాకా' మూవీ
Khiladi Movie Update
రవితేజ కథానాయకుడిగా రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమా రూపొందుతోంది. పెన్ స్టూడియోస్ - ఎ స్టూడియోస్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. రవితేజ సరసన నాయికలుగా మీనాక్షి చౌదరి - డింపుల్ హయతి అందాల సందడి చేయనున్నారు.

రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టు సింగిల్ కి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా టీమ్ సెకండ్ సింగిల్ ను వదలడానికి రెడీ అవుతోంది. దీపావళి కానుకగా నవంబర్ 4 తేదీన సెంకండ్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కూడా వదిలారు.

ఈ ఏడాది 'క్రాక్' సినిమాతో రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టిన రవితేజ, ఆ తరువాత చేస్తున్న సినిమా ఇది. సాధ్యమైనంత త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు. ఈ లోగా రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ'ని కూడా పట్టాలెక్కించేశాడు. ఈ సినిమా షూటింగు జరుగుతూ ఉండగానే 'ధమాకా'ను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. మొత్తానికి రవితేజ దూకుడు అదే రేంజ్ లో సాగుతోంది.