sunil Gavaskar: న్యూజిలాండ్ తో కీలక మ్యాచ్... వీరిద్దరినీ పక్కన పెట్టేయాలని సూచించిన సునీల్ గవాస్కర్!

  • టీ20 ప్రపంచకప్ లో పాక్ చేతిలో ఓడిపోయిన భారత్
  • బౌలింగ్ చేయని హార్ధిక్ పాండ్యా
  • హార్దిక్, భువనేశ్వర్ లను పక్కన పెట్టాలన్న గవాస్కర్
Gavaskar suggests to replacements for Hardhik Pandya and Bhuvaneshwar Kumar

టీ20 ప్రపంచకప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన కీలక మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాభవాన్ని మూటకట్టుకున్న సంగతి తెలిసిందే. 10 వికెట్ల తేడాతో భారత్ ఓటమిపాలయింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశారు. ఆదివారం నాడు న్యూజిలాండ్ జట్టుతో ఇండియా తలపడనుంది. ఈ సందర్భంగా గవాస్కర్ మాట్లాడుతూ భారత తుది జట్టులో రెండు మార్పులు చేయాలని సూచించారు.

ఆల్ రౌండర్ గా జట్టులోకి వచ్చిన హార్ధిక్ పాండ్యా బౌలింగ్ చేయలేని పక్షంలో అతన్ని పక్కన పెట్టాలని... అతని స్థానంలో ఇషాన్ కిషన్ ను తుది జట్టులోకి తీసుకోవాలని గవాస్కర్ సూచించారు. బౌలర్ భువనేశ్వర్ కుమార్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ ని తీసుకోవాలని చెప్పారు.

భుజం గాయంతో బాధపడుతున్న హార్ధిక్ పాండ్యా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ చేయలేదు. అయితే నెట్స్ లో మాత్రం బౌలింగ్ చేస్తూ కనిపించాడు. ఈ నేపథ్యంలోనే హార్ధిక్ ను పక్కన పెట్టాలని గవాస్కర్ సూచించారు. జట్టులో ఈ రెండు మార్పులు చేస్తే సరిపోతుందని... అంతకు మించి మార్పులు చేస్తే టీమిండియా భయపడుతోందని ప్రత్యర్థి జట్టు భావించే అవకాశం ఉందని అన్నారు.

More Telugu News