సతీసమేతంగా గవర్నర్ దంపతులను కలిసిన సీఎం జగన్

28-10-2021 Thu 20:20
  • రాజ్ భవన్ కు తరలివెళ్లిన సీఎం జగన్, వైఎస్ భారతి
  • మర్యాదపూర్వకంగా భేటీ
  • వైఎస్సార్ లైఫ్ టైమ్ అవార్డుల కార్యక్రమానికి రావాలని ఆహ్వానం
  • నవంబరు 1న అవార్డుల ప్రదానోత్సవం
CM Jagan and YS Bharathi met governor couple in Raj Bhavan
ఏపీ సీఎం జగన్ ఈ సాయంత్రం సతీసమేతంగా రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కలను, జ్ఞాపికలను అందజేశారు. అనంతరం, వచ్చే నెల 1వ తేదీన నిర్వహించే వైఎస్సార్ జీవితకాల సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవానికి చీఫ్ గెస్టుగా రావాలంటూ గవర్నర్ ను సీఎం జగన్ దంపతులు ఆహ్వానించారు.

వైఎస్ జగన్, భారతిల ఆహ్వానం పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించారు. వైఎస్సార్ జీవితకాల సాఫల్య పురస్కారాలను ఈ ఏడాది 50 మందికి పైగా ప్రముఖులకు అందజేయనున్నట్టు తెలుస్తోంది. పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని రాష్ట్ర సర్కారు ఈ అవార్డులతో గౌరవించనుంది.