కవలలకు జన్మనిచ్చిన క్రికెటర్ దినేశ్ కార్తీక్ అర్ధాంగి దీపికా పల్లికల్

28-10-2021 Thu 20:03
  • ఇద్దరు మగశిశువులకు జన్మనిచ్చిన దీపిక
  • ట్విట్టర్ లో వెల్లడి
  • కబీర్, జియాన్ అంటూ నామకరణం
  • ఇక తాము సంతోషంగా ఉండలేమంటూ వ్యాఖ్యలు
Dinesh Karthik and Deepika Pallikal blessed twin baby boys
క్రికెటర్ దినేశ్ కార్తీక్ తండ్రయ్యాడు. దినేశ్ కార్తీక్ అర్ధాంగి, ప్రముఖ స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్ కవలల మగ శిశువులకు జన్మనిచ్చింది. కవల తనయులకు డీకే, దీపిక దంపతులు అప్పుడే పేర్లు కూడా పెట్టేశారు. కబీర్ పల్లికల్ కార్తీక్, జియాన్ పల్లికల్ కార్తీక్ అంటూ తనయుల పేర్లను దినేశ్ కార్తీక్ దంపతులు ట్విట్టర్ లో వెల్లడించారు. తమ పెంపుడు కుక్కను కూడా దృష్టిలో ఉంచుకుని ముగ్గురం కాస్తా ఐదుగురం అయ్యామని తెలిపారు. కవల పిల్లలను కన్నాం... ఇక మేం ఏం సంతోషంగా ఉండగలం! అంటూ దినేశ్ కార్తీక్ దంపతులు చమత్కరించారు.