సుజనా చౌదరి ఇప్పటికీ తన రియల్ బాస్ కోసం పనిచేస్తున్నారు: విజయసాయిరెడ్డి

28-10-2021 Thu 19:48
  • ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు
  • దొరకని అమిత్ షా అపాయింట్ మెంట్
  • బాబు కోసం సుజనా ప్రయత్నాలు చేస్తున్నాడన్న విజయసాయి
  • అమిత్ షాతో సుజనా మాట్లాడుతున్న ఫొటో ట్వీట్
Vijayasai Reddy comments on Sujana and Chandrababu
చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంకా తన విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలంటూ అమిత్ షాను సుజనా చౌదరి ప్రాధేయపడ్డాడని తెలిపారు. హోంశాఖ పార్లమెంటరీ సంప్రదింపుల సంఘం సమావేశం సందర్భంగా అమిత్ షాతో సుజనా చౌదరి ఇదే అంశంపై మాట్లాడుతూ కనిపించాడని విజయసాయి ఆరోపించారు.

"చూస్తుంటే సుజనా ఇంకా పసుపు రంగును వదల్లేదని, కాషాయాన్ని ఇంకా వంటబట్టించుకోలేదని తెలుస్తోంది. అంతేకాదు, సుజనా నేటికీ తన రియల్ బాస్ కోసమే పనిచేస్తున్నట్టు నిరూపితమైంది" అంటూ ట్వీట్ చేశారు. అమిత్ షా పక్కనే సుజనా నడుస్తున్న ఫొటోను కూడా విజయసాయి పంచుకున్నారు.