రేపు బిగ్ అనౌన్స్ మెంట్ చేయబోతున్న కొణిదెల నిహారిక!

28-10-2021 Thu 18:25
  • తన తండ్రి నాగబాబు పుట్టినరోజు సందర్భంగా వెలువడనున్న ప్రకటన
  • 'ఓసీఎఫ్ఎస్' అంటే ఏంటో గెస్ చేయగలరా? అంటూ ఉత్కంఠను పెంచిన జీ5
  • తాను కూడా ఎగ్జైటింగ్ గా ఉన్నానన్న నిహారిక
Konidela Niharika to make big announcement tomorrow
కొణిదెలవారి అమ్మాయి నిహారిక రేపు బిగ్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నారు. రేపు తన తండ్రి నాగబాబు పుట్టినరోజు సందర్భంగా ప్రకటన వెలువడనుందని జీ5 సంస్థ ప్రకటించింది. మరో అద్భుతమైన అనుభూతి కోసం రెడీగా ఉండండి అని తెలిపింది. 'ఓసీఎఫ్ఎస్' అంటే ఏంటో గెస్ చేయగలరా? అని అడిగింది. జీ5 చేసిన ఈ ప్రకటనను నిహారిక రీట్వీట్ చేశారు. తాను కూడా ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నానని ఆమె అన్నారు. నాన్న పుట్టినరోజు సందర్భంగా 'ఓసీఎఫ్ఎస్' అంటే ఏమిటో రేపు వెల్లడిస్తానని తెలిపారు.

గత ఏడాది చైతన్యతో నిహారిక వివాహం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఆమె సినిమాల్లో నటించలేదు. వివాహానంతరం ఆమె తొలిసారి బుల్లితెరపై సందడి చేయబోతున్నారు.