'మంచిరోజులు వచ్చాయి' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గోపీచంద్!

28-10-2021 Thu 17:58
  • మారుతి నుంచి 'మంచిరోజులు వచ్చాయి'
  • సంతోష్ శోభన్ జోడీగా మెహ్రీన్
  • సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్
  • నవంబర్ 4వ తేదీన విడుదల
Manchi Rojulu Vachhayi Pre Release Event
కరోనా కాలంలో మారుతి ఒక చిన్న సినిమాను ప్లాన్ చేసుకున్నాడు. చాలా తక్కువ రోజులలో షూటింగును పూర్తి చేశాడు. ఆ సినిమా పేరే 'మంచిరోజులు వచ్చాయి'.  సంతోష్ శోభన్ .. మెహ్రీన్ జంటగా నటించిన ఈ సినిమాను, ఎస్.కె. ఎన్. బ్యానర్ వారు నిర్మించగా, మారుతి దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ .. ఫిల్మ్ నగర్ .. జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఈ వేడుక జరగనుంది.

ఈ  ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గోపీచంద్ చీఫ్ గెస్టుగా రానున్నాడు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఫంక్షన్ మొదలుకానుంది. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, వెన్నెల కిషోర్.. సప్తగిరి .. శ్రీనివాస రెడ్డి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. గోపీచంద్ హీరోగా మారుతి 'పక్కా కమర్షియల్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.