'వరుడు కావలెను' కోసం త్రివిక్రమ్ ఒక సీన్ రాశారట!

28-10-2021 Thu 17:30
  • తన స్వభావానికి దగ్గరగా ఉండే పాత్ర అంటున్న నాగశౌర్య 
  • రీతూ చాలా బాగా చేసింది
  • తనతో మరో సినిమా చేసే ఛాన్స్ 
  • తప్పకుండా హిట్ కొడతానన్న నాగశౌర్య     
Varudu Kaavalenu movie update
నాగశౌర్య హీరోగా సితార ఎంటర్టైమెంట్స్ బ్యానర్ పై 'వరుడు కావలెను' సినిమా నిర్మితమైంది. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా, రేపు థియేటర్లకు రానుంది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో నాగశౌర్య మాట్లాడాడు. ఈ సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు.

నా స్వభావానికి .. ఈ సినిమాలోని పాత్ర చాలా దగ్గరగా ఉంటుంది. అందువలన వెంటనే కనెక్ట్ అయ్యాను .. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను. కథ విన్నప్పుడు కలిగిన నమ్మకం .. షూటింగు జరుగుతున్న కొద్దీ పెరుగుతూ వచ్చింది. రీతూ వర్మ చాలా బాగా చేసింది. తనతో త్వరలోనే మరో సినిమా చేసే అవకాశం ఉంది.

ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఒక సీన్ రాశారు .. ఫ్లాష్ బ్యాక్ లో ఆ సీన్ వస్తుంది. చాలా ఎమోషనల్ సీన్ అది. చాలా కొత్తగా కూడా అనిపిస్తుంది. ఆయన రాసిన డైలాగ్స్ చెప్పే అవకాశం రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ కొడుతుందనే బలమైన నమ్మకం ఉంది"