Vijayasai Reddy: టీడీపీని రద్దు చేయాలని ఈసీని కోరాం: విజయసాయిరెడ్డి

Requested EC to cancel TDP says Vijayasai Reddy
  • టీడీపీ వంటి అసాంఘిక పార్టీ ఉండకూడదనే ఉద్దేశంతో ఈసీని కలిశాం
  • మా వినతిపత్రాన్ని ఈసీ తీసుకుంది
  • అనుచితంగా మాట్లాడిన వారిపై కేసులు పెట్టడం జరిగిందా? అని అడిగింది
రాజ్యాంగబద్ధంగా జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వంటి ఒక అసాంఘిక పార్టీ ఉండకూడదని... ఆ పార్టీని రద్దు చేయాలని ఈసీని కోరామని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. తెలుగుదేశం దొంగలకు, తెలుగుదేశం టెర్రరిస్టులకు స్థానం లేదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ కు విన్నవించడం జరిగిందని చెప్పారు. తమ వినతిపత్రాన్ని ఈసీ తీసుకుందని తెలిపారు. అనుచితంగా మాట్లాడిన వారిపై కేసులు పెట్టడం జరిగిందా? అని ఈసీ అడిగిందని... ఒకవేళ కేసులు పెట్టినట్టయితే, ఆ ఎఫ్ఐఆర్ కాపీలను పంపించమని చెప్పిందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని చెప్పారు.
Vijayasai Reddy
YSRCP
EC
Telugudesam

More Telugu News