మళ్లీ 'అల వైకుంఠపురములో..' కాంబో

28-10-2021 Thu 16:41
  • బన్నీ, త్రివిక్రమ్ ల 'అల వైకుంఠపురములో'
  • బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ కొట్టిన చిత్రం
  • 'అతిత్వరలో సర్ ప్రైజ్' అంటూ తాజాగా ట్వీట్  
Ala Vaikunthapuramulo combination repeats soon
కొన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసి, చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి సినిమాలలో ఒకటి 'అల వైకుంఠపురములో'! అల్లు అర్జున్, పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గత ఏడాది సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా మ్యూజికల్ గా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. తమన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలోని పాటలు యూట్యూబ్ లో రికార్డుల మీద రికార్డులు కొట్టాయి. ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించింది.

ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే, ఈ కాంబినేషన్లో అంటే బన్నీ, త్రివిక్రమ్, తమన్ కలయికలో మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా, 'అతి త్వరలో ఓ సర్ ప్రైజ్..' అంటూ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ రోజు ట్వీట్ చేశారు. అలాగే, తమన్, బన్నీ, త్రివిక్రమ్, నిర్మాత నాగవంశీ కలిసి దిగిన ఫోటోను కూడా పోస్ట్ చేశారు. దీనిని బట్టి ఈ కాంబినేషన్ త్వరలో రిపీట్ అవుతున్నట్టుగా భావిస్తున్నారు.