సీఎం జగన్ తో నాగార్జున లంచ్

28-10-2021 Thu 15:09
  • తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ తో భేటీ
  • నాగ్ తో పాటు సీఎంను కలిసిన నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్ రెడ్డి
  • సినీ పరిశ్రమకు చెందిన అంశాలపై చర్చ
Actror Nagarjun had lunch with Jagan
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో సినీ నటుడు నాగార్జున భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జగన్ ను నాగార్జున కలిశారు. ఈ సందర్భంగా నాగార్జునతో పాటు సినీ నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్ రెడ్డి మరికొందరు ఉన్నారు.

సమావేశం సందర్భంగా సినీ పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాలపై ఆయన చర్చించారు. సినీ రంగానికి వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ఈ సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు. మరోవైపు, జగన్ తో కలిసి నాగార్జున భోజనం చేశారు.