పాకిస్థాన్ గెలుపును సెలబ్రేట్ చేసుకునే వారిపై దేశద్రోహం కేసులు పెడతాం: యోగి ఆదిత్యనాథ్

28-10-2021 Thu 14:24
  • టీ20 ప్రపంచకప్ లో ఇండియాపై గెలిచిన పాకిస్థాన్ 
  • పాక్ విజయాన్ని కొందరు సెలబ్రేట్ చేసుకున్న వైనం
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు
Yogi Adityanath warns those who celebrates Pakistan victory
టీ20 ప్రపంచకప్ లో ఇండియాపై పాకిస్థాన్ గెలిచిన తర్వాత కొందరు సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. పాకిస్థాన్ గెలుపును సెలబ్రేట్ చేసుకున్న వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది.