తారక్–భన్సాలీ సినిమాకు వెరైటీ టైటిల్ ఖరారు?

28-10-2021 Thu 13:19
  • ‘జై భవ్ రే’ టైటిట్ ను ఫిక్స్ చేసినట్టు వినికిడి
  • త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం
  • ఇద్దరి కాంబోలో భారీ పౌరాణిక చిత్రమంటూ వార్తలు
Tarak Bhansali Movie Gets This Variety Title
పౌరాణిక చిత్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ ట్యాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి ఈ యంగ్ టైగర్.. చారిత్రక, పౌరాణిక కథాంశాలను తెరకెక్కించడంలో చెయ్యి తిరిగిన బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ చేతిలో పడితే ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంటుంది! వీరిద్దరి కాంబోలో ఓ గ్రాండ్ పౌరాణిక చిత్రం రాబోతోందంటూ కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

దీనికి టైటిల్ కూడా దాదాపు ఖరారైపోయిందంటూ ఇప్పుడు మరో ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. దానికి ‘జై భవ్ రే’ అనే వెరైటీ టైటిల్ ను ఫిక్స్ చేశారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కించనున్నట్టు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు.