ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం.. దళితబంధు నిలిపివేతపై హైకోర్టు కీలక తీర్పు

28-10-2021 Thu 12:03
  • హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో దళితబంధుని నిలిపివేసిన ఈసీ
  • ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు
  • తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఈసీకి ఉంటుందన్న హైకోర్టు
TS High Court dismisses petitions against EC decision to stop Dalit Bandhu
హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో దళితబంధు పథకాన్ని ఎన్నికల కమిషన్ నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికల కమిషన్ నిర్ణయాల విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈసీ నిర్ణయాన్ని రద్దు చేయాలనే విన్నపాన్ని తోసిపుచ్చింది. ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఈసీకి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం తీర్పును వెలువరించింది.