'పుష్ప' నుంచి మరో మాస్ బీట్!

28-10-2021 Thu 11:54
  • దేవిశ్రీ ప్రసాద్ నుంచి మరో మాస్ నంబర్ 
  • చంద్రబోస్ సాహిత్యం 
  • మౌనిక యాదవ్ ఆలాపన 
  • శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ  
Pushpa Lyrical Song Released
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా 'పుష్ప' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో, కథానాయికగా రష్మిక సందడి చేయనుంది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ అందరిలో ఆసక్తిని పెంచుతూ పోతున్నాయి.  ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను వదిలారు.  

"నువ్వు అమ్మీ అమ్మీ అంటాంటే నీ పెళ్లాన్నై పోయినట్టుందిరా .. సామీ .. నా సామీ, నిన్ను సామీ సామీ అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కగుందిరా సామీ .. నా సామీ" అంటూ ఈ పాట సాగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటకి చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా, మౌనిక యాదవ్ ఆలపించింది.

శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకి హైలైట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలామంది డాన్సర్ లపై  చిత్రీకరించిన ఈ పాట కలర్ఫుల్ గా ఉంది.  ఖర్చు కూడా పెద్ద మొత్తంలో పెట్టినట్టుగా అనిపిస్తోంది. నిన్న అల్లు అర్జున్ 'వరుడు కావలెను' స్టేజ్ పై చెప్పినట్టుగానే ఈ పాట బీట్ బాగుంది.