నాగ చైత‌న్య ఫొటోల‌ను డిలీట్ చేస్తోన్న‌ హీరోయిన్ స‌మంత!

  • కొన్ని రోజుల క్రితం వివాహ బంధానికి స్వ‌స్తి
  • దాదాపు 80 ఫొటోల‌ను ఇన్‌స్టా నుంచి డిలీట్
  • పాత జ్ఞాప‌కాల‌ను చెరిపేసుకుంటోన్న సామ్
sam deletes chitu pics

హీరో నాగ చైత‌న్యకు సంబంధించిన ఫొటోల‌ను హీరోయిన్ స‌మంత త‌న సామాజిక మాధ్య‌మాల నుంచి తొల‌గించేస్తోంది. వారిద్ద‌రు వివాహ బంధానికి స్వ‌స్తి చెప్పిన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో పాత‌ జ్ఞాపకాలను చెరిపివేసుకోవ‌డానికి స‌మంత ప్ర‌య‌త్నిస్తోంది. చైతూతో విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించినప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు స‌మంత ఆయ‌న‌కు సంబంధించిన దాదాపు 80 ఫొటోల‌ను త‌న ఇన్‌స్టా నుంచి డిలీట్ చేసింది.

ఇత‌ర కుటుంబ స‌భ్యులు, బంధువులు, స్నేహితుల‌తో ఉన్న ఫొటోలను మాత్ర‌మే ఉంచి, చైతూతో దిగిన ఫొటోల‌ను మాత్రం ఆమె తొల‌గించేస్తోంది. చైతూ-సామ్ విడిపోవ‌డం, ఇప్పుడు చైతూ ఫొటోల‌ను సామ్ తొల‌గిస్తుండ‌డం ప‌ట్ల‌ వారి ఫ్యాన్స్ హ‌ర్ట్ అవుతూ కామెంట్లు చేస్తున్నారు. చైతూతో విడిపోయిన అనంత‌రం ఆమె చేసే ప్ర‌తి పోస్టు వైర‌ల్ అవుతోంది.

More Telugu News