హైదరాబాద్ లో దారుణం.. అమ్మాయిపై క‌త్తితో యువ‌కుడి దాడి

28-10-2021 Thu 11:18
  • గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధి వట్టినాగులపల్లిలో ఘ‌ట‌న
  • ఓ కాలేజీలో డిగ్రీ చదువుతోన్న యువ‌కుడు
  • గ‌త‌ అర్ధరాత్రి ఓ యువ‌తి ఇంటికి వెళ్లి దాడి
  • యువ‌తికి గాయాలు.. ఆసుప‌త్రికి త‌ర‌లింపు
man attacks girl
హైదరాబాద్ లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ యువ‌తిపై ఓ యువ‌కుడు క‌త్తితో దాడి చేసి హ‌త్యాయ‌త్నం చేశాడు.  గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధి వట్టినాగులపల్లిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.  వట్టినాగులపల్లికి చెందిన ప్రేమ్‌సింగ్‌ కేపీహెచ్‌బీలోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. గ‌త‌ అర్ధరాత్రి ఓ యువ‌తి ఇంటికి వెళ్లిన అత‌డు ఆమెపై క‌త్తితో దాడి చేశాడు.

దీంతో ఆ యువతి కేక‌లు వేయ‌డంతో కుటుంబ స‌భ్యులు, స్థానికులు యువ‌కుడిని ప‌ట్టుకుని అత‌డిపైదాడి చేశారు. ప్రేమ్‌సింగ్ చేతిలో యువ‌తికి గాయాలు కాగా ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అలాగే, స్థానికుల దాడిలో ప్రేమ్ సింగ్ కు గాయాలు కావ‌డంతో అత‌డిని కూడా పోలీసులు ఆసుప‌త్రికి త‌ర‌లించి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఆ యువ‌తిపై ప్రేమ్ సింగ్ ఎందుకు దాడి చేశాడ‌న్న విష‌యం తెలియాల్సి ఉంది.