చైతూ, అఖిల్ అలాంటి సీన్స్ చేస్తామంటే ఒప్పుకోను: నాగార్జున

28-10-2021 Thu 11:18
  • చాలా ఫాస్టుగా బైక్ నడిపాను
  • ఆ సీన్ చూస్తే నేనే షాక్ అవుతాను
  • డూప్ లేకుండా చేయడం సాహసమే
  • అలాంటి రిస్క్ చేయవద్దనే పిల్లలతో చెబుతాను      
Nagarjuna Interview
నాగార్జున ఒక వైపున తన కెరియర్ పై దృష్టి పెడుతూనే, మరో వైపున చైతూ .. అఖిల్ కెరియర్ కి సంబంధించిన విషయాల పట్ల కూడా శ్రద్ధ పెడుతుంటారు. వాళ్లు ఎంచుకునే కథలు .. పాత్రలు .. ఆయా సినిమాల్లో రిస్కీ సీన్స్ విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఆ విషయాన్నే స్పష్టం చేశారు.

'నిన్నే పెళ్లాడతా' సినిమాలో బైక్ రైడింగ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. 80 .. 90 కిలోమీటర్ల స్పీడ్ తో డూప్ లేకుండా నేనే బైక్ నడిపాను. ఇప్పుడు ఆ సీన్స్ చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంటుంది. అప్పట్లో అంత దూకుడుగా .. అంత వేగంగా బైక్ రైడింగ్ చేసింది నేనేనా అనిపిస్తుంది. అలంటి సీన్స్ ఇప్పుడు చేయమని అడిగితే మాత్రం చేయను.

చైతూ .. అఖిల్ కి కూడా అలాంటి రిస్కీ సీన్స్ చేయవద్దనే చెబుతాను. ఒకవేళ వాళ్లు చేయడానికి సిద్ధపడినా నేను మాత్రం ఒప్పుకోను" అని చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం నాగార్జున 'ది ఘోస్ట్' .. 'బంగార్రాజు' సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. సాధ్యమైనంత వరకూ 'బంగార్రాజు'ను సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు.