దీపావళికి 'భీమ్లా నాయక్' నుంచి టీజర్!

28-10-2021 Thu 10:48
  • ముగింపు దశలో 'భీమ్లా నాయక్'
  • రానా జోడీగా సంయుక్త మీనన్ 
  • మాస్ అంశాలతో రానున్న టీజర్
  • జనవరి 12న సినిమా రిలీజ్
Bheemla Nayak movie update
పవన్ కల్యాణ్ - రానా ప్రధాన పాత్రధారులుగా 'భీమ్లా నాయక్' సినిమా రూపొందుతోంది. పవన్ సరసన నాయికగా నిత్యామీనన్ నటిస్తుండగా .. రానా జోడీగా సంయుక్త మీనన్ అలరించనుంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. వచ్చేనెలతో షూటింగు పార్టు కంప్లీట్ అవుతుందని అంటున్నారు.

సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా నుంచి వచ్చిన పవన్, రానా పాత్రల తాలూకు వీడియోస్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల పవన్ - నిత్యామీనన్ కాంబినేషన్లోని పాటను వదిలిన విషయం తెలిసిందే. ఇక దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు.

మాస్ ఎలిమెంట్స్ తో కూడిన టీజర్ ను రెడీ చేస్తున్నారని అంటున్నారు. ఈ టీజర్ ఈ సినిమాపై అంచనాలు పెంచడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12వ  తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. గట్టిపోటీ మధ్య బరిలోకి దిగుతున్న ఈ సినిమా, కొత్త రికార్డులను కొల్లగొడుతుందేమో చూడాలి.