మరోసారి పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధర!

28-10-2021 Thu 07:22
  • వచ్చే వారం సిలిండర్ ధరపై రూ.100 వరకు పెంపు
  • అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ధరలు
  • నష్టం భర్తీ చేసుకునేందుకు చమురు కంపెనీల ప్రయత్నం
  • దేశంలో మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధర
Gas price may hike in country next week
దేశంలో చమురు, సహజవాయు ధరలు ఇప్పట్లో అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఈ క్రమంలో నిన్న పెట్రోల్ ఒక లీటరుపై 36 పైసలు, డీజిల్ ఒక లీటరుపై 38 పైసలు పెరిగింది. ఇప్పుడు గ్యాస్ ధర కూడా పెరగనుంది. వచ్చే వారం సిలిండర్ పై రూ.100 వరకు పెంచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినందునే తాము పెంచాల్సి వస్తోందని చమురు, సహజవాయు కంపెనీలు చెబుతున్నాయి. నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే ధర పెంపు తప్పదని అంటున్నాయి. గత జులై నుంచి ఇప్పటివరకు రూ.90 వరకు పెరిగిన సిలిండర్ ధర... ఈసారి మరో రూ.100 వరకు పెరగడం అంటే సామాన్యుడి నెత్తిన మరింత భారం పడినట్టే.