టీ20 వరల్డ్ కప్: సూపర్-12లో బోణీకొట్టిన నమీబియా

28-10-2021 Thu 06:16
  • సూపర్-12లో స్కాట్లాండ్ వర్సెస్ నమీబియా
  • 20 ఓవర్లలో స్కాట్లాండ్ స్కోరు 109/8
  • 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన నమీబియా
  • రాణించిన జేజే స్మిట్
Namibia starts super twelve campaign with win
టీ20 వరల్డ్ కప్ సూపర్-12 ప్రస్థానాన్ని నమీబియా జట్టు గెలుపుతో ఆరంభించింది. అబుదాబిలో జరిగిన మ్యాచ్ లో స్కాట్లాండ్ పై నమీబియా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 109 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో నమీబియా 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 115 పరుగులు చేసింది. జేజే స్మిట్ (32 నాటౌట్) ఓ సిక్స్ తో జట్టును విజయతీరాలకు చేర్చాడు.

నమీబియా ఇన్నింగ్స్ లో ఓపెనర్లు క్రెగ్ విలియమ్స్ 23, మైఖేల్ వాన్ లింగెన్ 18 పరుగులు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో మైఖేల్ లీస్క్ 2, బ్రాడ్లే వీల్ 1, సఫ్యాన్ షరీఫ్ 1, క్రిస్ గ్రీవ్స్ 1, మార్క్ వాట్ 1 వికెట్ తీశారు. కాగా, స్కాట్లాండ్ సూపర్-12 దశలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలోనూ పరాజయం పాలైంది.