Para Military: బద్వేలు నియోజకవర్గంలో పారా మిలిటరీ బలగాల మోహరింపు

  • ఈ నెల 30న బద్వేలు స్థానానికి ఉప ఎన్నిక
  • నేటితో ముగిసిన ఎన్నికల ప్రచారం
  • బయటి వ్యక్తులు ఉండరాదన్న ఈసీ
  • 21 చెక్ పోస్టులు ఏర్పాటు
  • సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భద్రత కట్టుదిట్టం
Para Military forces deployed in Badvel constituency

కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలో పారా మిలిటరీ బలగాలను రంగంలోకి దింపారు. ఈ నెల 30న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు భద్రత కట్టుదిట్టం చేశారు. నియోజకవర్గంలో 21 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.

కాగా, బద్వేలు నియోజకవర్గంలో ఈ సాయంత్రంతో ప్రచార పర్వం ముగిసింది. ఈ క్రమంలో ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. బయటి వ్యక్తులు బద్వేలు నియోజకవర్గంలో ఉండరాదని స్పష్టం చేసింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని ఉన్నతాధికారులకు నిర్దేశించింది.

బద్వేలు నియోజకవర్గంలో మొత్తం 2,15,292 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 1,07,355 మంది మహిళా ఓటర్లు కాగా... 1,07,915 మంది పురుష ఓటర్లు ఉన్నారు. అంతేకాదు, 22 మంది ట్రాన్స్ జెండర్లకు కూడా నియోజకవర్గంలో ఓటు హక్కు ఉంది.

More Telugu News