జాసన్ రాయ్ వీరవిహారం... బంగ్లాదేశ్ ను చిత్తుచేసిన ఇంగ్లండ్

27-10-2021 Wed 19:06
  • అబుదాబిలో ఇంగ్లండ్ వర్సెస్ బంగ్లాదేశ్
  • 125 పరుగుల టార్గెట్ నిర్దేశించిన బంగ్లాదేశ్
  • 14.1 ఓవర్లలోనే ఛేదించిన ఇంగ్లండ్
  • 61 పరుగులు చేసిన జాసన్ రాయ్
England beat Bangladesh with the the help of Jason Roy lightening innings
టీ20 వరల్డ్ కప్ సూపర్-12 పోరులో ఇంగ్లండ్ జట్టు మరో విజయం నమోదు చేసింది. నేడు బంగ్లాదేశ్ తో అబుదాబిలో జరిగిన పోరులో ఇంగ్లండ్ అన్ని రంగాల్లో సత్తా చాటుతూ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు కేవలం 14.1 ఓవర్లలోనే ఛేదించింది.

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో హైలైట్ అంటే ఓపెనర్ జాసన్ రాయ్ గురించి చెప్పుకోవాలి. రాయ్ 38 బంతులు ఎదుర్కొని 61 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాయ్ స్కోరులో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ జోస్ బట్లర్ 18 పరుగులు చేసి అవుటైనా... డేవిడ్ మలాన్ (28 నాటౌట్), జానీ బెయిర్ స్టో (8 నాటౌట్) మరో వికెట్ పడకుండా మ్యాచ్ ను ముగించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షోరిఫుల్ ఇస్లాం 1, నసూమ్ అహ్మద్ 1 వికెట్ తీశారు.

కాగా, సూపర్-12 గ్రూప్-2లో నేడు స్కాట్లాండ్, నమీబియా తలపడనున్నాయి. టాస్ గెలిచిన నమీబియా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం వేదికగా నిలుస్తోంది.