'రొమాంటిక్' నుంచి 'ఇఫ్ యు ఆర్ మ్యాడ్' సాంగ్ రిలీజ్!

27-10-2021 Wed 19:05
  • పూరి నుంచి 'రొమాంటిక్' కథ 
  • దర్శకుడిగా శిష్యుడికి ఛాన్స్ 
  • కథానాయికగా కేతిక శర్మ పరిచయం 
  • ఈ నెల 29వ తేదీన థియేటర్లకు    
Romantic song video released
ఆకాశ్ పూరి - కేతిక శర్మ జంటగా రొమాంటిక్' సినిమా రూపొందింది. పూరి శిష్యుడు అనిల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. పూరి సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి, సునీల్ కాశ్యప్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మరో సాంగ్ ను వదిలారు.

'ఇఫ్ యు ఆర్ మ్యాడ్' అంటూ సాగే ఈ పాటను రన్నింగ్ బస్సులో హీరో హీరోయిన్లపై రొమాంటిక్ గా చిత్రీకరించారు. యూత్ ను థియేటర్లకు రప్పించడానికి ఈ సాంగ్ ఒకటి చాలేమో అనిపిస్తోంది. ఆ స్థాయిలో ఈ పాటను షూట్ చేశారు. భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించగా యాసిన్ నిజార్ - అశ్విని ఆలపించారు.

ప్రేమకీ .. వ్యామోహానికి మధ్య గల తేడాను ఆవిష్కరించే కథ ఇది. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రమ్యకృష్ణ నటించింది. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కథ .. స్క్రీన్ ప్లే .. మాటలు పూరి అందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.