ముంబయిలో సొంతింటి పనుల్లో పూజ హెగ్డే బిజీ

27-10-2021 Wed 18:50
  • సొంతింటి కల నెరవేర్చుకుంటున్న పూజ 
  • కలలు నిర్మించుకుంటున్నానంటూ పోస్టు
  • పూజ ఇంటి నిర్మాణపనులు పర్యవేక్షిస్తున్న తల్లి
  • సూపర్ మామ్ అంటూ కితాబునిచ్చిన బుట్టబొమ్మ
Pooja Hegde busy in construction works of her dream home in Mumbai
దక్షిణాది బుట్టబొమ్మ పూజ హెగ్డే ముంబయిలో సెటిలవుతున్నట్టు తెలుస్తోంది. ఈ కన్నడ భామ ముంబయిలో సొంత ఇల్లు నిర్మించుకుంటోంది. సొంత ఇల్లు కలిగివుండడం అనేది తన కల అని, ఇప్పుడది నెరవేరుతోందని పూజ ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించింది. తన ఇంటి పనులకు సంబంధించిన పిక్ ను కూడా పంచుకుంది. అందులో పూజ తల్లిని కూడా చూడొచ్చు.

"నా కలలను నిర్మించుకుంటున్నాను" అంటూ అమ్మడు క్యాప్షన్ కూడా పెట్టింది. కాగా, పూజ హెగ్డే సొంతింటి నిర్మాణ పనులను ఆమె తల్లి పర్యవేక్షిస్తోందట. ఈ సందర్భంగా పూజ తన తల్లిని 'సూపర్ మామ్' అంటూ అభివర్ణించింది.