'అన్నాత్తే' నుంచి ట్రైలర్ రిలీజ్!

  • రజనీ నుంచి రానున్న 'అన్నాత్తే'
  • తెలుగు టైటిల్ గా 'పెద్దన్న'
  • చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్
  • ముగ్గురు సీనియర్ హీరోయిన్ల సందడి
Annatthe Trailer released

రజనీకాంత్ .. శివ కాంబినేషన్లో 'అన్నాత్తే' సినిమా రూపొందింది. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలన్నింటినీ కవర్ చేస్తూ కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.

సిస్టర్ సెంటిమెంట్ .. యాక్షన్ .. కామెడీ ప్రధానంగా ఈ ట్రైలర్ సాగింది. విలన్స్ కాలుదువ్వడం .. రజనీ సవాల్ చేయడం వంటివి ఈ ట్రైలర్ లో హైలైట్ గా నిలుస్తున్నాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో .. ఊరికి పెద్దగా ..  ఊరు కోసం పోరాడే ధీరుడిగా రజనీ కనిపిస్తున్నాడు.

జగపతిబాబు మాస్ విలన్  గా కనిపిస్తున్నాడు. ఆయన పాత్రను డిఫరెంట్ గా డిజైన్ చేసినట్టుగా అనిపిస్తోంది. రజనీ  సరసన నాయికగా నయనతార  .. ఇతర ముఖ్య పాత్రల్లో ఖుష్బూ .. మీనా .. ప్రకాశ్ రాజ్ .. కీర్తి సురేశ్ కనిపిస్తున్నారు. తెలుగులో 'పెద్దన్న' టైటిల్  తో వస్తున్న ఈ  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

More Telugu News