దెబ్బకు థింకింగ్ మారిపోవాల!.. బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' ప్రోమో ఇదిగో!

27-10-2021 Wed 18:30
  • ఆహా ఓటీటీ యాప్ లో 'అన్ స్టాపబుల్' టాక్ షో
  • నవంబరు 4న తొలి ఎపిసోడ్
  • హోస్ట్ గా వ్యవహరిస్తున్న బాలకృష్ణ
  • సినీ తరహా పంచ్ డైలాగులతో ప్రోమో
Balakrishna shares Aha Unstoppable talk show promo
అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదికపైనా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆహా యాప్ లో ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్' కార్యక్రమం తొలి ఎపిసోడ్ నవంబరు 4న దీపావళి సందర్భంగా ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణపై ఆహా ఓటీటీ యాప్ నుంచి అదిరిపోయే ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమో లింకును బాలయ్య తన ఫేస్ బుక్ ఖాతాలో పంచుకున్నారు.

"మాటల్లో ఫిల్టర్ ఉండదు, సరదాలో స్టాప్ ఉండదు... సై అంటే సై, నై అంటే నై... దెబ్బకు థింకింగ్ మారిపోవాల!" అంటూ తనదైన శైలిలో బాలయ్య చెప్పిన డైలాగులు ఈ ప్రోమోలో చూడొచ్చు.