విజయసాయిరెడ్డి మాటల్లో అసహనం కనిపిస్తోంది: అయ్యన్న పాత్రుడు

27-10-2021 Wed 18:10
  • చంద్రబాబు ఢిల్లీ టూర్ పై విజయసాయి వ్యంగ్యం
  • ఘాటుగా స్పందించిన అయ్యన్న
  • జగన్ పూసాలు కదులుతున్నాయని వెల్లడి
  • జగన్ డ్రగ్ గ్యాంగ్ త్వరలో అరెస్ట్ అంటూ వ్యాఖ్యలు
Ayyanna Ptrudu counters Vijayasai Reddy satires on Chandrababu
టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్రం పెద్దల అపాయింట్ మెంట్ దొరక్కపోవడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేయడం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఘాటుగా స్పందించారు.

విజయసాయిరెడ్డి మాటల్లో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. గతంలో మోదీ, షా అపాయింట్ మెంట్ అంటూ హడావుడి చెయ్యడం ముందురోజు జగన్ బాత్రూంలో కాలుజారి పడడం మర్చిపోతే ఎలా వీసా రెడ్డీ? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. వైజాగ్ నుంచి వెలివేయడంతో జగన్ ను జైలుకు పంపడమే అజెండాగా విజయసాయిరెడ్డి ఢిల్లీలో తిరుగుతున్నాడని ఆరోపించారు.

హెరాయిన్, గంజాయి డ్రగ్ డాన్ జగన్ పూసాలు కదులుతున్నాయని, కేంద్ర సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణలో జగన్, డ్రగ్ గ్యాంగ్ త్వరలో అరెస్ట్ కావడం ఖాయమని అయ్యన్న పేర్కొన్నారు.

అంతేకాదు, వైసీపీ ఒక బూతు పార్టీ అని అభివర్ణించారు. అసభ్యకరంగా మాట్లాడడాన్ని నిషేధిస్తూ చట్టం తెస్తే ముందుగా బూతుపార్టీ అధ్యక్షుడు జగన్ చిప్పకూడు తినడం ఖాయం అని వెల్లడించారు. బూతు పార్టీ గుర్తింపు రద్దు కావడం ఖాయమని తెలిపారు.