ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'శ్రీదేవి సోడా సెంటర్'

27-10-2021 Wed 18:08
  • సుధీర్ బాబు, ఆనంది జంటగా తెరకెక్కిన 'శ్రీదేవి సోడా సెంటర్'
  • ఆగస్ట్ 27న థియేటర్లలో విడుదలై విజయం సాధించిన చిత్రం
  • నవంబర్ 4 నుంచి జీ5లో స్ట్రీమింగ్
Sridevi Soda Center movie to start streaming in ZEE5 from November 4
సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన 'శ్రీదేవి సోడా సెంటర్' చిత్రం ఆగస్ట్ 27న విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ ను సంపాదించుకుంది. ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు ఈ సినిమా సిద్ధమైంది. జీ5 సంస్థ ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా నవంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ చేయబోతోంది.

ఈ చిత్రానికి 'పలాస 1978' చిత్రాన్ని తెరకెక్కించిన కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో నరేశ్, రఘుబాబు, అజయ్, సప్తగిరి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. ఓటీటీలో విడుదలవుతున్న సందర్భంగా సినిమా ట్రైలర్ కట్ ను జీ5 విడుదల చేసింది.