Devineni Uma: ఏ ఆధారాలతో చంద్రబాబును టెర్రరిస్టు అన్నారు?: దేవినేని ఉమ
చంద్రబాబును టెర్రరిస్టు అంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని... ఈ వ్యాఖ్యలపై స్పందించి, ఆయనకు పోలీసులు నోటీసులు ఇస్తారా? అని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. ఏ ఆధారాలతో చంద్రబాబును విజయసాయిరెడ్డి టెర్రరిస్టు అన్నారని నిలదీశారు. ఆర్థిక ఉగ్రవాది విజయసాయి నుంచి చంద్రబాబు నడవడిక నేర్చుకోవాలా? అని దుయ్యబట్టారు. రాజకీయాల్లో 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబును ఉద్దేశించి ఇలా మాట్లాడటం దారుణమని అన్నారు.