Pushpaka Vimanam Movie: థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఆనంద్ దేవరకొండ "పుష్పక విమానం"

Pushpaka Vimanam to release in theatres on November 12
  • నవంబర్ 12న విడుదల అవుతున్న "పుష్పక విమానం"
  • ఈ నెల 30న రిలీజ్ కానున్న ట్రైలర్
  • ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించిన విజయ్ దేవరకొండ
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం "పుష్పక విమానం" రిలీజ్ కు రెడీ అవుతోంది. నవంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలైన సురేశ్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ "పుష్పక విమానం" చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చాయి. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ ఆంధ్ర, సీడెడ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, నైజాంలో గ్లోబల్ సినిమాస్ రిలీజ్ చేస్తోంది. ఓవర్సీస్ లో ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలింస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేయనుంది.

ఫస్ట్ లుక్ నుంచి ఇప్పటిదాకా "పుష్పక విమానం" సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. రిలీజ్ చేసిన రెండు పాటలకు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి. ఈ నెల 30న "పుష్పక విమానం" ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమాకు ప్రమోషన్ చేస్తుండటంతో... అభిమానులకు బాగా రీచ్ అవుతోంది. విజయ్ దేవరకొండ ఈ చిత్రానికి సమర్పకుడిగా కూడా వ్యవహరించారు. సాన్వీ మేఘన, గీతా సైనీ, సునీల్, నరేశ్, హర్షవర్ధన్, గిరిధర్, కిరీటి, వైవా హర్ష, అభిజిత్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలను పోషించారు.
Pushpaka Vimanam Movie
Release Date
Anand Devarakonda
Vijay Devarakonda
Tollywood

More Telugu News